: పెద్దపేగు కేన్సర్ నివారణి ప్రతి వంటింట్లోనూ ఉంది


ప్రాణాంతకమైన కేన్సర్ వివిధ రకాలు. అందులో పెద్దపేగు కేన్సర్ ఒకటి. అయితే ఈ తరహా కేన్సర్ మూలకణంపై దాడి చేసే సమ్మేళనం ప్రతి ఇంట్లోనూ దొరుకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో బంగాళాదుంపలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లోనూ ఏదో రకంగా బంగాళాదుంపల వినియోగం ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన బంగాళదుంపను ఆయుర్వేదంలో పలు సమస్యలకు నివారణిగా వినియోగిస్తారు. అక్కడక్కడ లభ్యమయ్యే ఊదారంగు బంగాళా దుంపల్లో పెద్దపేగు కేన్సర్ ను నివారించే సమ్మేళనాన్ని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కేన్సర్ ను నివారించాలంటే మూలకణంపై దాడి చేయడమే సరైన వైద్యమని తెలిపిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంపలో ఆ సమ్మేళనం ఉన్నట్టు తెలిపారు. బంగాళాదుంపను పూర్తిగా కాల్చినా ఆ సమ్మేళనం నాశనం కాలేదని, అదీకాక కేన్సర్ ను వ్యాప్తి చేసే మూలకణంపై అది సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైందని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News