: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-డీ6
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ నిప్పులు చిమ్ముతూ, నింగిలోకి దూసుకెళ్లింది. 29 గంటల కౌంట్ డౌన్ అనంతరం సాయంత్రం 4.52 గంటలకు రాకెట్ నింగికెగసింది. 2,117 కేజీల బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-డీ6 తనతో పాటు తీసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ టెక్నాలజీతో భారత్ చేస్తున్న రెండో ప్రయోగం ఇది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతానికి రాకెట్ సరైన దిశలో, విజయవంతగా దూసుకుపోతోంది.