: కుస్తీ యోధుడు... శవమై గోనె సంచీలో లభ్యమయ్యాడు


జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు హన్స్ రాజ్ (21) హత్యకు గురయ్యాడు. హర్యాణాకు చెందిన హన్స్ రాజ్ ఉదయం వాకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు, కాక్రోయి గ్రామ శివారుల్లో గోనె సంచీలో అతని మృతదేహం లభ్యమైంది. గోనె సంచీలోంచి అతని మృతదేహం బయటకి తీసిన పోలీసులు అతని శరీరంపై తీవ్రంగా కొట్టిన గాయాలను గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా, గతంలో ఇదే గ్రామంలో ఇలాంటి ఐదు హత్యలు జరిగినట్టు స్థానికులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News