: జగన్ అక్రమాస్తుల కేసులో నా పేరు తొలగించండి... హైకోర్టులో శ్రీనివాసన్ పిటిషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలంటూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ కేసులోని ఆరో ఛార్జ్ షీట్ లో శ్రీని పేరును సీబీఐ పేర్కొంది. ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఈ కేసులో శ్రీనిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.