: యాసిడ్ దాడి బాధితులకు వైద్యం అందించాల్సిందే: ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశం

యాసిడ్ దాడికి గురైన బాధితులకు వైద్యం అందించాల్సిందేనని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. వైద్యం చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించడానికి వీలులేదని స్పష్టం చేసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిస్థాయి చికిత్స అందించాలని ఆదేశించింది. లేకుంటే క్రిమినల్ కోడ్ కింద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

More Telugu News