: పురుషులు మారాల్సిన సమయం ఆసన్నమైంది: కంగనా రనౌత్
పురుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. 'కట్టిబట్టి' సినిమాలో నటిస్తున్న ఈ సుందరి ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తొలినాళ్ల అనుభవాలను గుర్తు చేసుకుంది. సినీ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో పలువురు వక్రదృష్టితో చూసేవారని తెలిపింది. కొంతమంది చులకనగా మాట్లాడేవారని చెప్పింది. హీరోయిన్లు ఎప్పుడూ హీరోలు, లేదా నిర్మాతలపై ఆధారపడతారని అలాంటి వారు భావిస్తారని కంగనా వెల్లడించింది. అలాంటి వారు 'క్యా కరేగీ?' అంటూ వ్యంగ్యంగా అడుగుతారని కంగనా చెప్పింది. మహిళలపై పురుషుల అభిప్రాయాలు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కంగనా తెలిపింది. విజయపథంలో దూసుకుపోవడంతో అలాంటి వారు తోకముడిచారని కంగనా పేర్కొంది. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని చెప్పింది. లోపల ఒకటుంచుకుని, బయటికి మరొకటి చెప్పేవారంటే తనకు గిట్టదని కంగనా వెల్లడించింది.