: ఆ ముగ్గురిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాం: రఘువీరా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో కేసులు పెడతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా అంటూ రాష్ట్రాన్ని మోసం చేశారనీ, ఇప్పుడు ప్యాకేజీల పేరుతో మరోసారి వంచించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను చూసి బాబు నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు అనంతపురంలో మీడియాతో రఘువీరా మాట్లాడుతూ, ఏది ఏమైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.