: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సోనియాగాంధీకి ఊరట

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఊరట లభించింది. ఈ ఘటనలో ఆమెపై నమోదైన కేసును అమెరికా కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అమెరికా కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న మీదట, ఈ కేసులో సోనియాకు ఎలాంటి సంబంధం లేదంటూ కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. సిక్కుల ఊచకోత ఘటనలో సోనియా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, అమెపై కేసులు నమోదు చేయాలని న్యూయార్క్ లోని సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ సోనియాపై ఈ కేసు నమోదు చేసింది.

More Telugu News