: బీఎండబ్ల్యూ కారులో కిమ్స్ ఆస్పత్రి ఇఎన్ టీ వైద్యుడు రాఘవేంద్రరావు డెడ్ బాడీ

హైదరాబాదులో ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఇఎన్ టీ వైద్యుడు రాఘవేంద్రరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఖరీదైన బీఎండబ్ల్యూ కారులోనే ఆయన విగత జీవిగా కనిపించారు. కారులో రాఘవేంద్రరావు మృతదేహాన్ని గుర్తించిన ఆయన కుటుంబసభ్యులు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన వెనుక గల కారణాలను వెలికితీసేందుకు రంగంలోకి దిగారు.

More Telugu News