: చంద్రగిరి కోటలో ‘ఎర్ర’ డంప్... స్వాధీనం చేసుకున్న పోలీసులు, తప్పించుకున్న స్మగ్లర్లు
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న చంద్రగిరి కోటలో భారీ ఎర్రచందనం డంప్ పట్టుబడింది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాత్రి అటవీ శాఖాధికారులు కోట పరిధిలో భారీ ఎత్తున సోదాలు చేశారు. ఈ సందర్భంగా డంప్ ను గుర్తించిన అటవీ శాఖాధికారులు, దానిని అక్కడినుంచి తరలించేందుకు యత్నిస్తున్న స్మగ్లర్లపై దాడి చేశారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో స్మగ్లర్ల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.