: ఆ సినిమాకు సల్మాన్ ఖాన్ నిర్మాతే కాదు, ఎడిటర్ కూడాను!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న తొలి సినిమా 'హీరో'కు ఎడిటర్ గా కూడా ఆయన పనిచేశారని ఆ సినిమా దర్శకుడు తెలిపారు. బాలీవుడ్ నటులు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ, సునీల్ షెట్టి కుమార్తె అథియా శెట్టి జోడీగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న హీరో సినిమాకు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఎడిట్ చేయాలని సల్మాన్ ను తాను కోరానని నిఖిల్ తెలిపాడు. సినిమాను ఎడిట్ చేసిన సల్మాన్ ఖాన్ 30 నిమిషాల నిడివిగల సీన్లను తొలగించాడని నిఖిల్ చెప్పాడు. దీంతో సినిమా నిడివి రెండు గంటల నాలుగు నిమిషాలకు వచ్చిందని వెల్లడించాడు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.