: తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమం చేపడతామని, పోరాటాలు తమకు కొత్త కాదని హెచ్చరించారు. విభజన చట్టం కేవలం ఏపీకే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ఇవ్వకున్నా తమకు అభ్యంతరం లేదని మీడియా సమావేశంలో చెప్పారు. కేంద్రం ఏమాత్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్న శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలోని ఇతర పార్టీల నేతలు ఈ విషయంపై కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని నిలదీశారు.