: మధ్యాహ్నం 3.45 గంటలకు మీడియా ముందుకు జైట్లీ, చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వివరాల వెల్లడికి కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు మీడియా ముందుకు రానున్నారు. భేటీలో కేంద్రం తరఫున హాజరైన జైట్లీ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబుతో కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అయితే మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే మీడియాతో మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. తాను తర్వాత సవివరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని జైట్లీతో కలిసి మళ్లీ లోపలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జైట్లీతో చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడినట్లు సమాచారం. తదనంతరం నేటి మధ్యాహ్నం 3.45 గంటలకు అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడతారని మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. చంద్రబాబు కూడా ఈ సమావేశంలో మాట్లాడతారని కూడా వారికి వర్తమానం అందింది.

More Telugu News