: కిష్టారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం... పలువురి నివాళులు
తెలంగాణ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పీఏసీ ఛైర్మన్ గా కిష్టారెడ్డి సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కిష్టారెడ్డి భౌతికకాయానికి పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, నివాళులర్పించారు.
మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి తదితరులు నివాళులర్పించారు. అంతకుముందు మంత్రి హరీశ్ రావు కూడా కిమ్స్ కు వెళ్లి కిష్టారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.