: మచిలీపట్నంలో ధర్నా చేపట్టిన జగన్

వైకాపా అధినేత జగన్ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి చనిపోయిన వారి కుటుంబసభ్యులతో కలసి ఆయన ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు వైకాపాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని మండిపడ్డారు. ఈ ధర్నా అనంతరం విజయవాడలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలకు ఆయన హాజరవుతారు.

More Telugu News