: నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) ఛైర్మన్‌ గా పటోళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి కూడా విజయం సాధించిన ఆయన, 2009 నుంచి నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. పటోళ్ల మృతితో ఓ సీనియర్ నేతను తాము కోల్పోయామని, ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు.

More Telugu News