: భారత్ ఆర్థిక రంగం పటిష్ఠంగా ఉంది...ఆందోళన అవసరం లేదు: రఘురాం రాజన్

భారత ఆర్థిక రంగం పటిష్ఠంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ కుదుపుకు గురవ్వడంపై ఆయన స్పందించారు. స్టాక్ మార్కెట్ ల పతనంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చైనాలో చోటుచేసుకుంటున్న మార్పులే స్టాక్ మార్కెట్ పతనానికి కారణమని తెలిపారు. భారత మదుపరులు తాజా పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే విదేశీ మారక నిల్వలను మార్కెట్ లోకి విడుదల చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా భారత ఆర్థికరంగం మరింత ఉత్పాదన చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పుంజుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రతికూల వ్యవస్థకు భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో ఉందని ఆయన తెలిపారు. విదేశీ మారక నిల్వలు 380 బిలియన్ డాలర్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశమని ఆయన చెప్పారు.

More Telugu News