: మంచి చేయడం కోసమే చీప్ లిక్కర్: మంత్రి తలసాని

తెలంగాణలో భారీ ఎత్తున చీప్ లిక్కర్ తీసుకొచ్చేందుకు టీఎస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో సారా మహమ్మారిని తరిమికొట్టేందుకే చీప్ లిక్కర్ తీసుకొస్తున్నామని... ఈ నిర్ణయం వల్ల మంచే జరుగుతుందని ఆయన అన్నారు. చీప్ లిక్కర్ పై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం పెరిగిందని తలసాని వెల్లడించారు.

More Telugu News