: భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ను అడ్డుకున్న వర్షం
కొలంబోలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు ఆటను వరుణుడు అడ్డుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 190 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచిన తరుణంలో మిస్టర్ వరుణ్ ఎంటర్ అయ్యాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో గ్రౌండ్ తడిసిపోయింది. అయితే, కాసేపటికే వర్షం ఆగిపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొండంత ఊరట లభించినట్టైంది. ఎందుకంటే, కెప్టెన్ గా తొలి టెస్టు విజయాన్ని అందుకోవడానికి కోహ్లీ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడటంతో, ఫీల్డ్ అంపైర్లు భోజన విరామ సమయాన్ని ప్రకటించారు.