: ప్రత్యేక హోదా తొలగించినందుకు చాలా థ్యాంక్స్: రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు పొందే వీవీఐపీ జాబితా నుంచి తొలగించారు. దీనిపై రాబర్ట్ వాద్రా తొలిసారి స్పందించారు. వీవీఐపీ హోదా నుంచి తనను తొలగించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని... ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. వాస్తవానికి ఈ హోదాను తానెప్పుడూ కోరుకోలేదని... ఈ హోదా వద్దని గతంలోనే ప్రభుత్వానికి లేఖ కూడా రాశానని వాద్రా చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, దౌత్య అధికారులు, చీఫ్ జస్టిస్ లకు ఈ హోదా ఉంటుంది. అయితే, అధికార పక్షానికి అత్యంత ఆప్తులైన వ్యక్తులు, ఎస్పీజీ రక్షణలో ఉన్నవారు కూడా ఈ హోదాను పొందడం పరిపాటి.