: వంగవీటి రంగా వచ్చినట్టుంది: పవన్ సభలో మహిళా రైతు స్పందన

గుంటూరు జిల్లా పెనుమాకలో రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి ప్రసంగాన్ని ముగించారాయన. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని... అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెడతానని ఆయన అన్నారు. ఇదే సమయంలో, కేవలం చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని... భూసేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పారు. అంతకు ముందు రైతుల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, ఒక మహిళా రైతు మాట్లాడుతూ, తనకు 30 ఎకరాల భూమి ఉందని... ఇటీవలే హాస్పిటల్ ఖర్చుల కోసం రెండెకరాల భూమిని అమ్మేశామని చెప్పారు. అదే సమయంలో, ఎంతో కష్టపడి కొనుక్కున్న భూమి అని, ఇది తీసేసుకుంటే తామెలా బతకాలని, మరణం తప్ప మరే దారి లేదని అన్నారు. అంతేకాకుండా, తమరు రావడం చూస్తుంటే వంగవీటి రంగా వచ్చినట్టుందని అన్నారు. దీంతో, అక్కడున్న జనాల్లో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.

More Telugu News