: హాయ్ ల్యాండ్ చేరుకున్న పవన్ కల్యాణ్...స్వల్ప విరామం తర్వాత పెనుమాకకు పయనం
జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లాలో ప్రవేశించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు వ్యతిరేకిస్తున్న రైతులకు మధ్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్, వారితో భేటీ అయ్యేందుకు నేటి ఉదయం రోడ్డు మార్గం మీదుగా పెనుమాకకు బయలుదేరిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ప్రముఖ రిసార్ట్స్ హాయ్ ల్యాండ్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ కొద్దిసేపు విరామం తీసుకుని పెనుమాకకు బయలుదేరనున్నారు. మార్గమధ్యంలో ఆయన ఉండవల్లిలో భూసేకరణ ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలనుకుంటున్న భూములను కూడా పవన్ కల్యాణ్ పరిశీలించనున్నట్లు సమాచారం.