: పాలమూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు ఎస్సైలకు గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలంలో నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ జిల్లాకు చెందిన ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు గాయాలపాలయ్యారు. జిల్లాలోని మల్దకల్, గద్వాల, ఐజ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు గద్వాల మండలం దయ్యాలవాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్దకల్ ఎస్సై శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు ఎస్సైలను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More Telugu News