: నల్లారి మోసగాడు...చిరును సీఎం చేయాలని అధిష్ఠానానికి లేఖ రాశా: మాజీ మంత్రి డొక్కా వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోశయ్యను సీఎం పదవి నుంచి దించేస్తూ ఉమ్మడి రాష్ట్రానికి కొత్త సీఎంను నియమిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి తానో లేఖ రాశానని చెప్పిన ఆయన అందులో పలు కీలక అంశాలను సూచించానని తెలిపారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డొక్కా, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పటిదాకా స్పీకర్ గా కొనసాగి సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి మోసగాడని ఆ లేఖలో అధిష్ఠానానికి వివరించానని ఆయన తెలిపారు. అంతేకాక చిరంజీవిని సీఎం చేయాలని కూడా సూచించానన్నారు. నల్లారి స్థానంలో చిరంజీవి సీఎం అయి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈ సందర్భంగా డొక్కా వ్యాఖ్యానించారు.

More Telugu News