: చీప్ లిక్కర్ పై మహిళా మోర్చా కన్నెర్ర... అరెస్ట్ చేసిన టీ పోలీస్, సొమ్మసిల్లిన మహిళలు

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్ పై బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తెలంగాణ ఆబ్కారీ శాఖ ముందు ఆందోళనకు దిగింది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని బలవంతంగా వ్యాన్ ఎక్కించే యత్నం చేశారు. పోలీసులను మహిళా మోర్చా నేతలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళా నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా పోలీసులు వారిని వ్యాన్ లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News