: 'ఫాంటమ్' సినిమాను పాక్ లో నిషేధించడంపై సైఫ్ అలీ ఖాన్ స్పందన

పాకిస్థాన్ లో 'ఫాంటమ్' సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించడంపై హీరో సైఫ్ అలీ ఖాన్ స్పందించారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించామని తెలిపారు. అయితే, ఆ సినిమాయేమీ పాకిస్థాన్ వ్యతిరేక చిత్రం కాదని స్పష్టం చేశారు. "దురదృష్టం ఏమిటంటే... టెర్రరిజం నేపథ్యంలో మనం సినిమాలు తీస్తే వాళ్లు (పాకిస్థాన్) బ్యాన్ చేస్తారు, అలాంటి సినిమాలే వాళ్లు తీస్తే మనం (భారత్) బ్యాన్ చేస్తాం. నిషేధం ఎదుర్కోకుండా ఉండాలంటే 'రేస్' తరహా సినిమాలు తీయాలి. 'ఫాంటమ్' సినిమా ఉగ్రవాదం నేపథ్యంలోనే తీశాం. అందులో భారత్ వ్యతిరేకులైన పాకిస్థానీలను చూపాం. దానర్థం, ఆ సినిమా పాక్ వ్యతిరేకమని కాదు" అని పేర్కొన్నారు.

More Telugu News