: రిషి, అభిషేక్ లపై లతా మంగేష్కర్ ప్రశంసలు జల్లు
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ నటులు రిషి కపూర్, అభిషేక్ బచ్చన్ లపై ప్రశంసల జల్లు కురిపించారు. వారిద్దరినీ 'ఇండియన్ ఐడల్ జూనియర్' టీవీ షోలో చూశానని, చాలా బాగా పాడారని మెచ్చుకున్నారు. "ఆ షోలో రిషీని పాడమని పిలిచినప్పుడు అతను 'మై షాయర్ తో.. నహీ' గీతాన్ని ఆలపించాడు. నేనెంతో ఆశ్చర్యపోయాను. అంత మధురమైన కంఠస్వరం అతనికుందని నాకు తెలియదు. ఆ తర్వాత అభిషేక్ కూడా పాడాడు. అతనూ బాగానే పాడాడు" అని ట్వీట్ చేశారు. ఆల్ ఈజ్ వెల్' సినిమాలో నటించిన రిషి, అభిషేక్ ఆ సినిమా ప్రమోషన్ కోసం 'ఇండియన్ ఐడల్ జూనియర్' టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిషి తన తొలి చిత్రం 'బాబీ'లోని 'మై షాయర్...' గీతంతో అలరించగా, అభిషేక్ తన 'బ్లఫ్ మాస్టర్' సినిమాలోని 'రైట్ హియర్ రైట్ నౌ' పాటతో ఊపేశాడు.