: స్నేక్ రోబోలను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ-హైదరాబాద్ శాస్త్రవేత్తలు


భారత సైంటిస్టులు సరికొత్త రోబోలకు రూపకల్పన చేస్తున్నారు. ఐఐటీ-హైదరాబాద్ కు చెందిన మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ఈ రోబోల అభివృద్ధిలో తలమునకలై ఉంది. ఈ రోబోలకు 'సర్ప్' (స్నేక్ లైక్ ఆర్టిక్యులేటెడ్ రోబో ప్లాట్ ఫామ్) అని నామకరణం చేశారు. ఈ స్నేక్ రోబోలు విపత్తు సహాయ చర్యల్లో, గాలింపు చర్యల్లో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇరుకైన ప్రదేశాల్లోనూ ముందుకెళ్లడం వీటి ప్రత్యేకత. "భూకంపం అనంతర సహాయ చర్యలు కానివ్వండి, లేక, అగ్నిప్రమాదం కానివ్వండి, న్యూక్లియర్ ప్లాంట్ లో ప్రమాదం అయితేనేమి, మనుషులు వెళ్లలేని చోటికి ఈ స్నేక్ రోబో వెళుతుంది" అని పరిశోధనలో పాలుపంచుకున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్.ప్రశాంత్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News