: చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చేసింది... సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు నేటి ఉదయం విజయవాడ చేరుకుంది. ప్రస్తుతం విజయివాడలోనే ఉన్న చంద్రబాబు, బస్సును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనల సందర్భంగా అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా బస్సును తయారుచేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్టీసీ అధికారులు బెంజ్ కంపెనీకి చెందిన బస్సును కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఛండీగఢ్ లో దానిని బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దించారు. ఇందుకోసం రూ.5 కోట్ల మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం. అచ్చం మిలిటరీకి చెందిన భారీ వాహనంలా కనిపిస్తున్న ఈ వాహనం శక్తిమంతమైన బాంబు దాడులను కూడా తట్టుకుని నిలుస్తుందట. ఇక ఈ బస్సు నిర్వహణ బాధ్యతలను చంద్రబాబు ఆర్టీసీ అధికారులకే అప్పగించారు.