: 8 గంటలకు మించి పనిచేస్తుంటే గుండెపోటుకు దగ్గరవుతున్నట్టే!


అతిగా పనిచేసే వారు త్వరగా గుండెపోటుకు గురవుతారట. ఇన్నాళ్లూ పనిఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న అనుమానాలు మాత్రమే ఉండగా, ఇప్పుడీ విషయం అధికారికంగా కూడా నిరూపితమైంది. రోజుకు 8 గంటలు మించి పనిచేసే వారిపై మిగతావారితో పోలిస్తే గుండెపోటు ప్రమాదం 33 శాతం అధికమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారానికి 55 గంటల కన్నా ఎక్కువ పనిచేసే వారు గుండెపోటుకు దగ్గరైనట్లేనని, 35 నుంచి 40 గంటలు పనిచేసే వారితో పోలిస్తే, వీరికి హృదయ సమస్యలు 13 శాతం అధికమని తెలియజేశారు. సుమారు 6 లక్షల మందిని అధ్యయనంలో భాగం చేసి కనుగొన్న ఈ విషయాలను గురువారం నాడు 'ది లాన్సెట్' పత్రిక ప్రచురించింది. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లోని ఎపిడెమాలజీ ప్రొఫెసర్ మికా కివిమాకి నేతృత్వంలో దాదాపు 9 ఏళ్ల పాటు ఈ అధ్యయనం జరిగింది.

  • Loading...

More Telugu News