: నవ్యాంధ్ర ‘భూసేకరణ’కు రంగం సిద్ధం... నేటితో ముగియనున్న ‘ల్యాండ్ పూలింగ్’ గడువు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కారు భూ సేకరణ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటిదాకా ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) బాటనే అవలంబించింది. ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, పాలనాపరమైన ఇక్కట్లను ప్రభుత్వం వివరించిన తీరును రైతులు అర్థం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఊహించిన దాని కంటే రైతుల నుంచి మెరుగైన స్పందనే లభించింది. అయితే ఇంకా 3,852 ఎకరాల భూమి అవసరమని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. ఈ భూమి కోసం భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ ను ఇప్పటికే సిద్ధం చేసిన సీఆర్డీఏ అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ కానుంది.

More Telugu News