: ఢిల్లీ దేశ రాజధానే కాదు...అత్యాచారాల కేంద్రం కూడాను
'ఢిల్లీ దేశ రాజధానే కాదు అత్యాచారాల కేంద్రం కూడా' అని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అత్యాచారాల్లో ఢిల్లీయే టాప్ అని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలోని మెట్రో నగరాల్లో మహిళల భద్రత విషయంలో కోల్ కతా మెరుగ్గా ఉందని తేలింది. అక్కడ అత్యాచారాలకు సంబంధించి 36 కేసులే నమోదయ్యాయని క్రైం రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. ఢిల్లీలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది. 2013లో 1440 అత్యాచార కేసులు నమోదు కాగా, 2014లో 1800 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 2014లో ఢిల్లీలో 15,265 క్రైం కేసులు నమోదు కాగా, అందులో 4.5 శాతం కేసులు మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తెలిపింది.