: శంషాబాదు ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం... షికాగో వెళుతున్న యువకుడి అరెస్ట్
హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి ఉదయం బుల్లెట్ల కలకలం రేగింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి బుల్లెట్ తో విమానాశ్రయంలోకి ప్రవేశించడమే కాక అమెరికాలోని షికాగో వెళ్లేందుకు యత్నించాడు. అయితే ఎయిర్ పోర్టు అధికారుల తనిఖీలో సదరు యువకుడు పట్టుబడ్డాడు. తనిఖీల్లో బుల్లెట్ వెలుగు చూడటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.