: నవాజ్ షరీఫ్ తో సమావేశమైన రషీల్ షరీఫ్
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాక్ ఆర్మీ చీఫ్ రషీల్ షరీఫ్ సమావేశమయ్యారు. భారత్-పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధావల్, సర్తాజ్ అజీజ్ ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే చర్చల్లో ఎలాంటి వైఖరి అవలంభించాలి? అనే దానిపై జాతీయ భద్రతాధికారులకు స్పష్టత ఇచ్చేందుకు ఇద్దరూ సమావేశమయ్యారు. భారత్ పై ఎదురుదాడికి దిగడమే సరైన పరిష్కారమని వీరు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై దాడులు, సరిహద్దు పేలుళ్లు, పంజాబ్, జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడులపై భారత్ ఘాటుగా స్పందించనుందన్న వార్తల నడుమ, వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సుదీర్ఘ కాలంగా చర్చలు జరగకపోవడంతో ఆదివారం జరగనున్న చర్చలపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.