: ఏపీకి ఏదో ఒక పేరుతో సాయపడాలి... రాజకీయ లబ్ధి కోసమే బీహార్ కు ప్యాకేజీ: సీతారాం ఏచూరి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్డీయే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని కేంద్రానికి హితవు పలికారు. భవిష్యత్ దృష్ట్యా ఏదో ఒక పేరుతో ఏపీకి సాయపడాలని సూచించారు. అటు, బీహార్ కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్యాకేజీ ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల వేళ, ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీలో ప్రచారం చేసిన బీజేపీ ఆపై మాట నిలుపుకోలేదని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడం బీజేపీకి అలవాటేనని అన్నారు.

More Telugu News