: ఎలా చూసినా ఈ నగరమే ది బెస్ట్!


విద్య, వైద్యం, మెరుగైన వసతులు, సంస్కృతి, పర్యావరణం ఇలా అన్ని అంశాల్లో ప్రపంచంలోనే ది బెస్ట్ నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వేలో 140 నగరాలపై ప్రజాభిప్రాయాలు సేకరించగా, మెల్బోర్న్ తొలి స్థానంలో నిలిచింది. ఇలా మెల్బోర్న్ అత్యుత్తమ సిటీగా నిలవడం ఇది వరుసగా ఐదోసారి. 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లను ఈ నగరం సాధించింది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడా నగరాలు వాంకోవర్, టొరంటోలు, ఆస్ట్రేలియాకే చెందిన ఆడిలైడ్ నిలిచాయి. టాప్-10లో ఏడు ఆస్ట్రేలియా, కెనడాకు చెందిన నగరాలకు స్థానం దక్కడం విశేషం.

  • Loading...

More Telugu News