: కడప జిల్లా రైల్వే కోడూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం

కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాధవరం గేటు వద్ద నిర్వహించిన తనిఖీల్లో మూడు కార్లలో తరలిస్తున్న 102 ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. ఆ సమయంలోనే కారు డ్రైవర్లు పరారవ్వగా ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.2.27 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మూడు కార్లు, నాలుగు సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్లను గంగిరెడ్డి ప్రధాన అనుచరులుగా పోలీసులు గుర్తించారు.

More Telugu News