: పాక్ తో క్రికెట్ ఆడాలంటే...సరిహద్దుల్లో శాంతి నెలకొనాలి!: అనురాగ్ ఠాకూర్

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ టోర్నీ జరగాలంటే రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని బీసీసీఐ కార్యదర్శి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సిమ్లాలో ఆయన మాట్లాడుతూ, భారత సరిహద్దుల్లో పాక్ దళాలు కాల్పులు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో అలజడి ఉంటే ప్రజలు మ్యాచ్ లు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనే దిశగా పాక్ ప్రయత్నించాలని ఆయన సూచించారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా వయసు పైబడడంతో అనారోగ్యం కారణంగా బీసీసీఐ విధులకు దూరంగా ఉన్నారు. కీలకమైన నిర్ణయాల్లో అనురాగ్ ఠాకూర్ నిర్ణయమే కీలకం కావడం విశేషం.

More Telugu News