: బంగారంతో భగవద్గీతను రాసిన ముస్లిం

గుజరాత్ కు చెందిన 75 ఏళ్ల మహమ్మద్ యూనిస్ షేక్ అనే ముస్లిం భగవద్గీతను బంగారంతో రాసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అందజేశారు. చేతితో తయారు చేసిన 160 పేజీలపై బంగారంతో ఆయన ఈ భగవద్గీతను రాశారు. బంగారు కడ్డీలను కరిగించి ఇంకు తయారు చేసిన యూనిస్ షేక్ కుటుంబం పేజీకి 18 లైన్లు ఉండేలా రాశారు. ఈ బంగారు భగవద్గీత తయారీలో యూనిస్ షేక్ కుటుంబం మొత్తం పాలు పంచుకుందని తెలిపారు. కాగా, ఈ భగవద్గీతను జైన మత పెద్దలు తయారు చేయాలని కోరారని, అందుకే ఎన్నటికీ చెడిపోని విధంగా చేతితో తయారు చేసిన పేపర్ పై భగవద్గీత రాసినట్టు తెలిపారు. దీనిని తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందని ఆయన చెప్పారు.

More Telugu News