: ఉగ్రవాదులకు హైదరాబాదు సేఫ్ జోన్ గా మారుతోంది: బీజేపీ నేత కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కొద్దిసేపటి క్రితం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కారు ఉదాసీన వైఖరి కారణంగా హైదరాబాదు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని ఆరోపించారు. అనుమానాస్పద ప్రాంతాల్లోని ఇంటింటినీ చెక్ చేయకపోతే సమీప భవిష్యత్తులోనే పెను ముప్పు సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కారణంగానే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవానికి ప్రభుత్వం మోకాలొడ్డుతోందని ఆయన ఆరోపించారు.