: 'మెసేంజర్' లోపం బయపెట్టాడని ఆ ఇంజనీర్ ని ఫేస్ బుక్ తీసేసింది!


ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఫేస్ బుక్ మెసేంజర్ లోని లోపాన్ని ఎత్తి చూపిన యువ ఇంజనీర్ ను ఫేస్ బుక్ తమ సంస్థ నుంచి తప్పించింది. భారత సంతతి యువ ఇంజనీర్ అరన్ ఖన్నా హార్వార్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. ఇంటర్న్ షిప్ కోసం ఫేస్ బుక్ లో చేరాడు. ఇంటర్న్ షిప్ లో భాగంగా అరన్ ఖన్నా ఓ ప్లగిన్ రూపొందించాడు. ఈ ప్లగిన్ ఫేస్ బుక్ నిర్వహిస్తున్న మెసేంజర్ లోని లోపాన్ని బయపెట్టింది. మెసేంజర్ ద్వారా ఛాట్ చేసే వారు ఎక్కడ నుంచి ఛాట్ చేస్తున్నారు? అన్న విషయం అవతలి వారికి సులువుగా తెలిసిపోతుంది. అంటే ఒక ఊరిలో ఉండి, మరో ఊరిలో ఉన్నానని చెప్పడం కుదరదు. దీనికి అరన్ రూపొందించిన ప్లగిన్ ఇన్ స్టాల్ చేసుకుంటే అవతలి వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వంటివన్నీ కూడా ఇట్టే తెలిసిపోతాయి. దీంతో ఈ ప్లగిన్ ను 85 వేల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. దీని గురించి అమెరికాలోని ప్రధాన పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జరిగిన తప్పిదం గ్రహించిన ఫేస్ బుక్ వెంటనే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. వెంటనే ఫేస్ బుక్ అతని ప్లగిన్ ను డిసేబుల్ చేయాలని సూచించింది. అరన్ అలాగే చేశాడు. మీడియాతో మాట్లాడవద్దని నిబంధన విధించింది. అలాగే చేశాడు. వెంటనే మెసేంజర్ యాప్ లో సమస్యను పరిష్కరించి అప్ డేట్ చేసింది. అనంతరం అరన్ ఖన్నాను విధుల్లోంచి తప్పించింది.

  • Loading...

More Telugu News