: ఈ ఫేస్ బుక్ సెట్టింగ్ వెంటనే మార్చుకోండి... లేకుంటే మీ వివరాలన్నీ హ్యాక్!
వేలాది మంది యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ నుంచి సులువుగా తస్కరించడానికి వీలుందని బ్రిటన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజా మొయినుద్దీన్ నిరూపించాడు. మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించమని సలహా ఇస్తున్నాడు. యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయమంటూ ఫేస్‌బుక్ యాజమాన్యం గత కొంతకాలంగా ప్రోత్సహిస్తోంది. ఎవరైనా ఫేస్ బుక్ లో డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ వాడుతున్నట్లయితే, అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యూజర్ పేరును, ఫోటో, లొకేషన్, ఇతరత్రా సమాచారాన్ని అత్యంత సులువుగా దొంగలించవచ్చని, అతని ఫేస్ బుక్ ఖాతాలోకి వెళ్లి కామెంట్స్ కూడా చేయవచ్చని ఆ యువ టెక్కీ తెలిపాడు. దీంతో యూజర్ల సమాచారం హ్యాకర్లు, ఇతర మార్కెటింగ్ సంస్థలకు విక్రయించే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు. ఇలా నష్టపోకుండా ఉండాలంటే ఫేస్ బుక్ సెట్టింగ్స్ లో 'హూ కెన్ ఫైండ్ మీ?' అనే చోట 'ఎవ్రీవన్ / పబ్లిక్' ఆప్షన్ ను తొలగించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ ప్రొఫైల్ అన్యులకు కనిపించదు. అంతకన్నా ముందు ఫోన్ నెంబరును యాడ్ చేసుకోకుండా ఉంటే మరింత మంచిది.