: కొత్త సంస్థను ప్రారంభించిన గూగుల్... పేరు 'ఆల్ఫాబెట్'


ఇంటర్నెట్ సెర్చింజన్ గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. అయితే, ఇవేమీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కొన్నయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడులకు నష్టాలను కూడా తెచ్చాయి. ఇప్పుడు కొత్తగా, వినూత్న ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేసే నిమిత్తం గూగుల్ 'ఆల్ఫాబెట్' పేరిట కొత్త సంస్థను ప్రారంభించింది. "ఆల్ఫాబెట్ పేరిట కొత్త జీవితం మొదలైంది. నాకు, సెర్గీకి ఇది ఎంతో ఆనందకరమైన రోజు" అని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ పేజ్ వ్యాఖ్యానించారు. 'ఆల్ఫాబెట్ అనే పేరు మాకెంతో నచ్చింది. ఆల్ఫాబెట్ అంటే, కొన్ని అక్షరాల సముదాయం. ఓ భాషను సూచిస్తుంది. మానవులు కనుగొన్న అత్యంత వినూత్నతల్లో ఇదొకటి. అందుకే ఈ పేరును ఎంచుకున్నా'మని ఆయన అన్నారు. 1998లో సెర్చ్ వ్యాపారానికి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న సెర్గీ బ్రిన్ తో కలసి ఈ కొత్త సంస్థను నిర్వహించనున్నామని ఆయన అన్నారు. గూగుల్ సంస్థ ఇకపై సుందర్ పిచాయ్ నేతృత్వంలో సాగుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News