: గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్... త్వరలో బాధ్యతల స్వీకరణ
అంతర్జాతీయ యవనికపై భారత ప్రతిభ మరోసారి మెరిసింది. ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ సారధ్య బాధ్యతలు భారతీయుడి చేతికి చిక్కాయి. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నిన్న అధికారికంగా ప్రకటించారు. గూగుల్ బాధ్యతలను సుందర్ పిచాయ్ కు అప్పగించి, గూగుల్ హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాటెట్ లోకి మారుతున్నట్లు లారీ పేజ్ ప్రకటించారు.
తనతో పాటు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ కూడా ఆల్ఫాబెట్ కే వస్తున్నారని చెప్పారు. దీంతో గూగుల్ సారధ్య బాధ్యతలు పూర్తిగా సుందర్ చేతిలో పెడుతున్నట్లు లారీ పేజ్ చెప్పకనే చెప్పారు. 1972లో చెన్నైలో జన్మించిన సుందర్ ... ఖరగ్ పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ అనంతరం స్టాన్ ఫోర్డ్ వర్సీటి నుంచి ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్ లో చేరిన సుందర్ ఆ సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు.