: మరికాసేపట్లో మునికోటి మృతదేహానికి పోస్ట్ మార్టం... సాయంత్రం అంత్యక్రియలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన మునికోటి మృతదేహానికి నేటి సాయంత్రం తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. మొన్నటి కాంగ్రెస్ సభ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ స్థానిక యువకుడు మునికోటి ఒంటికి నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. కలకలం రేపిన ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో వైద్యులు మునికోటిని చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే నిన్న అతను మరణించాడు. అతని మృతదేహానికి మరికాసేపట్లో పోస్ట్ మార్టం జరగనుంది. అనంతరం అతడి మృతదేహానికి నేటి సాయంత్రం తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News