: ప్రజా కోర్టులో కేసీఆర్ కు శిక్ష తప్పదు: టీటీడీపీ
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని టీటీడీపీ నేత ఎల్.రమణ ఆరోపించారు. ప్రభుత్వం ఇదే తీరుతో ముందుకు సాగాలనుకుంటే... టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై తాము వాస్తవాలను మాట్లాడుతుంటే... పక్క రాష్ట్రంలోని నేతలను టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు విధానాలను అనుసరిస్తూ, తప్పుడు ఆలోచనలతో ముందుకు సాగితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అన్నారు. మరో నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ, తోటపల్లి రిజర్వాయర్ సాధించేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.