: మునికోటి సోదరుడితో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తిరుపతిలో మునికోటి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, మునికోటి సోదరుడితో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మునికోటి కుటుంబ సభ్యలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మునుకోటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇప్పటికే మునికోటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల చెక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.