: కేసీఆర్ అలా మాట్లాడటం తగదు: వీహెచ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.హనుమంతరావు తప్పుబట్టారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కార్మికుల సమ్మెను దిక్కుమాలిన సమ్మె అనడం ద్వారా... దళితులను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. ఈ కార్మికుల్లో అధికశాతం మంది దళితులే ఉన్నారని... దీంతో, ఈ వ్యాఖ్యలతో దళితులను అవమానించినట్టయిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని కొందరు టీఆర్ఎస్ నేతలు అంటున్నారని... అదే జరిగితే ఎదుర్కోగల సత్తా తమకుందని చెప్పారు.