: ట్విట్టర్ లోనూ 'బై' బటన్... ఆన్ లైన్ షాపింగ్ చేసుకోవచ్చట!
సామాజిక మాధ్యమంగా మొదలై ఆన్ లైన్ వ్యాపార సంస్థలుగా మారిన వెబ్ సైట్ల జాబితాలో ట్విట్టర్ కూడా చేరిపోయింది. కొద్ది కాలం క్రితం ఫేస్ బుక్ లో 'బై' బటన్ రాగా, తాజాగా, ట్విట్టర్ కూడా అదే బాటలో నడిచింది. ట్విట్టర్, తన మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్ని దగ్గర చేసింది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ మొబైల్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ 'బై' బటన్ వాడుతూ, కస్టమర్లు షాపింగ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు కొన్ని షాపింగ్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నామని, అతి త్వరలో పూర్తిస్థాయిలో ఈ బటన్ పనిచేస్తుందని ట్విట్టర్ చెబుతోంది.