: ప్రత్యేక హోదా కోసం నిప్పంటించుకున్న యువకుడు!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు ఉద్ధృతమవుతున్నాయి. తిరుపతిలో ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ పోరు సభలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ యువకుడు అనూహ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. 50 శాతం పైగా అతని ఒళ్లు కాలిందని, గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు, సభకు వచ్చిన వారంతా ఉలిక్కిపడ్డారు. యువకుడిని తిరుపతి మంచాలవీధికి చెందిన బి.ఎం.కోటిగా పోలీసులు గుర్తించారు.